March 24, 2026

కోచింగ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వ కొరడా

కోచింగ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వ కొరడా

🎓 రోజుకు 5 గంటలే బోధన – కొత్త నిబంధనలు 2026 ☞︎︎

విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, భద్రతను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
“ఏపీ కోచింగ్ సంస్థల నియంత్రణ & పర్యవేక్షణ నిబంధనలు-2026” ముసాయిదాను సిద్ధం చేసింది

🚨 ముఖ్య నిబంధనలు ఇవే

🌐 సమయ పాలన:
✓ కోచింగ్ రోజుకు 5 గంటలకుమించకూడదు
✓ పాఠశాల / జూనియర్ కళాశాల పనివేళల్లో కోచింగ్ నిషేధం

🌐 సెలవు:
✓ ప్రతి ఆదివారం తప్పనిసరి సెలవు

🌐 రిజిస్ట్రేషన్:
✓ 50 మందికిపైగా విద్యార్థులు ఉంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్
✓ నిబంధనలు అమలైన 3 నెలల్లో పూర్తి చేయాలి

🌐 ర్యాంకుల ప్రదర్శనపై నిషేధం:
✓ విద్యార్థుల మార్కులు / ర్యాంకులు / ఫోటోలు బోర్డులు లేదా వెబ్‌సైట్లలో పెట్టకూడదు

🌐 ఫీజు వాపసు:
✓ మధ్యలో వెళ్ళిపోతే 10 రోజుల్లో ప్రో-రాటా పద్ధతిలో ఫీజు తిరిగి ఇవ్వాలి

🌐 సదుపాయాలు:
✓ ఆత్మహత్యల నివారణకు స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లు
✓ ప్రతి 5 మందికి ఒక టాయిలెట్
✓ ప్రతి 10 మందికి ఒక బాత్ రూమ్
✓ సీసీటీవీ కెమెరాలు & 24 గంటల సెక్యూరిటీ

🌐 మానసిక ఆరోగ్యం:
✓ విద్యార్థులకు కౌన్సిలింగ్ సదుపాయం తప్పనిసరి ✰

🚨 పర్యవేక్షణ వ్యవస్థ:
✓ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ తనిఖీలు చేస్తుంది
✓ ఫిర్యాదుల కోసం డిజిటల్ పోర్టల్ & డ్రాప్ బాక్సులు

📚 వర్తింపు:
JEE, NEET, EAPCET కోచింగ్ సెంటర్లతో పాటు ట్యూషన్లు, క్రీడలు, నృత్యం, సంగీత శిక్షణ కేంద్రాలన్నీ ఈ నిబంధనల కిందకు వస్తాయి ✓

🚨 శిక్షలు:
1️⃣ మొదటిసారి – ₹50,000 జరిమానా
2️⃣ రెండోసారి – ₹1 లక్ష జరిమానా
3️⃣ మూడోసారి – రిజిస్ట్రేషన్ రద్దు ☞︎︎︎

⚠️ సంస్థ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి ఆత్మహత్య జరిగితే వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు

📲 ఈ ముఖ్య సమాచారం ప్రతి విద్యార్థి & తల్లిదండ్రులకు చేరేలా తప్పనిసరిగా SHARE చేయండి

KUCHIPUDI JERNIYA JOSEF

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

Marketing Managed by - KARIYO TECH SOLUTIONS

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION