National

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -ప్రపంచ అహింసా దినోత్సవము మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి................

By NANDURI VENKATESWARLU • 2026-10-03 04:06 • 2 views   Share WhatsApp Share Facebook Share X
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -ప్రపంచ అహింసా దినోత్సవము మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి................

తేదీ: 02-10-2026: శేరిలింగంపల్లి చందానగర్:
ఈరోజు మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రుల జయంతోత్సవాల సందర్భంగా మాదాపూర్ స్వాతి హైస్కూల్ ఆవరణలో గల మహాత్మాగాంధీ విగ్రహానికి మరియు లాల్ బహదూర్ శాస్త్రిగారి చిత్రపటానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ " *మన దేెశానికి స్వాతంత్ర్యము సముపార్జించిన ముఖ్య నాయకులలో మహాత్మా గాంధి ఒకరు* " అని అన్నారు. " *రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సత్యం మరియు అహింస అనే సిద్ధాంతాలతో సత్యాగ్రహం మరియు సహాయ నిరాకరణ అనే ఆయుధాలతో పోరాడి స్వాతంత్య్రాన్ని సాధించినటువంటి మహోన్నత వ్యక్తి గాంధీ మహాత్ముడు"* అని కొనియాడారు. " *మహాత్మాగాంధీ అంటరాని తనానికి, పరిసరాల పరిశుభ్రతకు, గ్రామ స్వరాజ్యానికి, మహిళా రక్షణకు మరియు సాధికారతతో పాటు స్వాతంత్ర్యపు ఫలాలు అందరికి అందాలని నిరంతరం తలపోసిన వ్యక్తి మహాత్మాగాంధీ"* అని అన్నారు. " *హిందూమతం రోజురోజుకూ ఆదరణ తగ్గుతుందని భావించి దళితులకు దేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలను ప్రోత్సహించిన మహోన్నమైన వ్యక్తి* " అని అన్నారు. *"ఆయన రాజయోగిగా వుండవలసిన వాడు రాజకీయ నాయకునిగా మారాడు. ప్రపంచంలో రోజురోజుకూ హింస మరియు ఉగ్రవాదం ప్రజ్వరిల్లి ఆస్తి, ప్రాణనష్టాలతో పాటు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ప్రపంచమంతా సుఖ, శాంతులతో వుండేందుకు ఐక్యరాజ్యసమితి వారు గాంధీగారు చూపిన అహింసా విధానమే ఉత్తమమని భావించి గాంధీగారి జయంతి అయిన అక్టోబరు 2వ తేదీని ప్రపంచ అహింసా దినోత్సవముగా ప్రకటించి పాటించుచున్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం మరియు అహింస విధానమే శ్రీరామ రక్ష. జాతి నిర్మాణంలో సమైక్యత, సమగ్రత తప్పక ఉండాలి.‌ భిన్నత్వంలో ఏకత్వం గల భారతీయ సమాజంలో సమైక్యత చాలా అవసరం"* అని తెలిపారు. " *స్వతంత్ర సమరయోధుడు మాజీ రైల్వే మరియు హోం శాఖామాత్యులు భారతదేశ రెండవ ప్రధానిగా విశిష్టమైన సేవలందించినటువంటి మహోన్నతుడు శాస్త్రిగారు* " అని కొనియాడారు. " *శాస్త్రిగారు నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి గొప్ప వ్యక్తి"* అని తెలిపారు. " *1965వ సంవత్సరములో భారత్, పాక్ యుద్ధ సమయంలో భారత జాతినంతా ఏకతాటిపై నడిపించి విజయం సాధించారు. జై కిసాన్, జై జవాన్ అనే స్ఫూర్తి దాయకమైన నినాదాలతో జాతిని ఉత్తేజ పరచారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అవినీతి, స్వార్థ పరమైన ఆలోచనలను విడనాడి సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి* " అని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రిక, అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు, శివరామకృష్ణ , G.V.రావు , సత్యనారాయణ, నండూరి వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.

NANDURI VENKATESWARLU 0 followers