యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారణం ఎమ్మెల్యే కాదా…
మున్సిపల్ తీర్మానంలో తుంగలో తొక్కి
ఎన్నికల్లో లబ్ది కోసం యావర్ రోడ్డు విస్తరణను అడ్డుకున్నారు..
ప్రజా ఆస్తులు పరిరక్షించే బాధ్యత ఎమ్మెల్యేకు లేదా .
సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన ఆక్రమణలు తక్షణమే తొలగించాలి.
2008 అనంతరం టైటిల్ లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు.
పెట్రోల్ బంక్ పేరిట ఆక్రమణ చేసి నిర్మించిన భవనాలు తక్షణమే తొలగించాలి.
పెట్రోల్ బ్యాంక్ పేరిట కబ్జాల్లో ఉన్నా.. టైటిల్ లేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
యావర్ రోడ్డు 100 ఫీట్లు విస్తరణ చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు
ఎమ్మెల్యే సంజయ్ కుమార్
యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా అనడం విడ్డూరంగా ఉంది
యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యే కారణం కాదా.. అని ప్రశ్నించారు
జగిత్యాల మున్సిపల్ యావర్ రోడ్డును
100 ఫీట్ల విస్తరణ చేయాలని తీర్మానం చేస్తే,
కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తాదో అని
ఏడాదిన్నర నివేదిక తొక్కి పెట్టి, ఎన్నికల్లో లబ్ది కోసం యావర్ రోడ్డు విస్తరణ తెరపైకి
తెచ్చారు
100 ఫీట్ల విస్తరణ చేయాలని ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను టౌన్ ప్లానింగ్ 2017 జూన్ లో ప్రభుత్వానికి సమర్పించారు
ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత
రెండున్నర సంవత్సరాలు జాప్యం చేశారు.
2021 జూన్ 14న 100 ఫీట్ల కోసం జి ఓ 94
ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది
ఎమ్మెల్యే గా ఎన్నికైన రెండేళ్ల తర్వాత
2023 ఆగస్టు లో టీ డి ఆర్ తెర పైకి తీసుకు వచ్చారు
పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎందుకు విస్తారన చేయలేదు
యావర్ రోడ్డు విస్తరణ చేపట్టడం మీ బాధ్యత కాదా.. అని నిలదీశారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 జూన్ 2024 సీ ఏం రేవంత్ రెడ్డికి యావర్ రోడ్డు లేఖ రాశానని దీంతో సీఎం స్పందించి, అధికారులను ఆదేశించగా సుమారు 100 కోట్ల వ్యయం అవుతుందని కలెక్టర్ సిఎం కు నివేదించారనీ గుర్తు చేశారు
యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారణం అయ్యి ప్రజలకు జవాబు చెప్పలేక..ఎమ్మెల్యే ఇప్పుడు కొత్తగా యావర్ రోడ్డు విస్తరణ చేస్త అంటన్నారు . ఇన్నాళ్లు విస్తరణ చేపడుత అంటే అడ్డుకున్నదెవరు..చెప్పాలి.
మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా
నిర్మించిన భవనాలు,
ఆక్రమణలు తొలగించాలని అధికాలకు లేఖా రాస్తే ప్రజలకు ఇచ్చే నోటీస్ లో కూడా నా పేరు పెట్టారు
అయినా ఆక్రమణలు మాత్రం తొలగించలేదు
అధికారులతో రివ్యూ లో మున్సిపల్ అనుమతికి విరుద్ధంగా చేపట్టిన
ఆక్రమణలు తొలగించాలి అనే ప్రకటనలకి పరిమితం అయ్యారు
పదేళ్లు మీరే అధికారంలో ఉండి యావ ర్ రోడ్డు విస్తరణ ఎందుకు అమలు చేయలేదు
సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం తో వాహనాలు పార్కింగ్ రోడ్డు పై చేయాల్సి వస్తుంది
పెట్రోల్ బంక్ ఆక్రమణలు తొలగించడం
శాసన సభ్యుడికి సంబందం లేదా..ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత లేదా..
కొత్త బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ ఆక్రమణలకు కోర్టు చట్టబద్ధత కల్పించ లేదు.. మున్సిపల్ చర్యలు చేపట్టాలి అని పేర్కొంది
కిబాల ఒరిజినల్ డాక్యుమెంట్ సమర్పించకపోవడంతో, ఎటువంటి టైటిల్ లేదు అని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
టైటిల్ లేకుండా 2008 తర్వాత భవన్ నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు.
నాలుగు దశాబ్ధాలుగా ప్రజా ఆస్తులు కాపాడిన. దేవాలయ భూములు కాపాడిన..అని జీవన్ రెడ్డి అన్నారు
బాధ్యత గల పౌరుడిగా ప్రజా ఆస్తుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టే.. కండువా కప్పుకొని మాట్లాడుతున్న.
జగిత్యాల లో వాణిజ్య సముదాయాలు నిర్మించడంతో మున్సిపల్ కు ఏటా రెండు కోట్ల ఆదాయం సమకూరుతుంది.
వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి నగర బాట కార్యక్రమంలో జగిత్యాల మున్సిపాలిటీ కి 25 కోట్లు నిధులు ఇచ్చారు.ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడలేనివిధంగా జగిత్యాల మున్సిపాలిటీలో నిరంతరం త్రాగు నీరు అందిస్తున్నాం
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు ప్రభుత్వ విధానం..
ఆక్రమణలు, సెట్ బ్యాక్ లైన్ నిర్మాణాలు కళ్ళకు కనపడడం లేదా… ఎమ్మెల్యేకు బాధ్యత లేదా… పాత్రికేయులు, ప్రజా సంఘాలకే బాధ్యత ఉందా..ప్రజా ఆస్తులు ఆక్రమణకు గురి అవుతుంటే.. కాపాడవలసిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా… ఎమ్మెల్యే చేతిలో ఉన్న పనిచేయకుండా పదేళ్ల పాటు చేసే పాపాలు చేసి, ఇప్పుడు యావర్ రోడ్డు విస్తరణ చేపట్టకపోతే రాజకీయాల్లో కొనసాగానని చెప్పడం విస్మయం గొలుపుతుంది.సెట్ బ్యాక్, ఆక్రమణలు చేపట్టిన భవనాలుఒక్క రూపాయి ఖర్చు చేయకుండా తొలగించవచ్చు ఆక్రమణలు తొలగించడం మున్సిపల్ బాధ్యత.. ప్రజా జీవితంలో ఎమ్మెల్యే పదవి ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయంలో కొనసాగుతారా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు.. ఎమ్మెల్యే గా ముందుగా సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన భవనాలు అక్రమ నిర్మాణాలు తొలగించాలి..

