- శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత..
ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై కవిత వివరణ.. నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా.. తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చాను.. బీఆర్ఎస్లో చేరిక ముందే జాగృతిని స్థాపించా.. తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చా
– కవిత
8 ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.. పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు.. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు.. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు.. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది.. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష
– కవిత
కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది.. ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదు.. కేసీఆర్‌కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా.. నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు.. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా
– కవిత
లక్ష్మీనరసింహ స్వామి, నా ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ.. నైతికతలేని పార్టీలో నేను ఉండదల్చుకోలేదు.
#BRSParty #BRS #KavithaKalvakuntla #MLCKavitha #TelanganaNews #TelanganaAssembly #TelanganaPolitics #Telangana .

