Subscribe to Updates
Get the latest news
- వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం, పీసీసీ చీఫ్.
- చైనీస్ మాంజాపై ఉక్కుపాదం విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు *హైదరాబాద్ సీపీ సజ్జనర్*
- శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత..
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు గిరిప్రదక్షణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- सायबर पुलिस का सराहनीय अभियान: 35 गुम मोबाइल लौटे, चेहरों पर लौटी मुस्कान
- Prasad Ayare: A Grassroots Leader for Ward 65
- युद्ध का असली मकसद: वैश्विक व्यापार और भू-राजनीतिक रणनीति
- रफ़्तार का नशा और मौत की पार्टी: जब माता-पिता के अरमानों की जगह घर पहुँचती है ‘लाश’
Author: SUNCHU SURESH
వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం, పీసీసీ చీఫ్.
వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం, పీసీసీ చీఫ్. ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలని దిశానిర్దేశం.. పెండింగ్ పనులను పరిష్కరించాలని సూచన. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని ఆదేశం. మరో వారం, పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అలర్ట్ చేశారు. ఈ లోపే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా తమను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్ పలు సూచనలు చేస్తూ.. వారిని అప్రమత్తం చేస్తున్నారు సిటీలో, పట్టణాల్లో గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రులు కూడా దీనిపై…
చైనీస్ మాంజాపై ఉక్కుపాదం విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు *హైదరాబాద్ సీపీ సజ్జనర్* సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. పక్షుల స్వేచ్ఛకు, అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనీస్ మాంజా నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులకు సీపీ సజ్జనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పండుగ పూట గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినప్పటికీ, అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని హితవు పలికారు. చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందని, ఇది మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి…
శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై కవిత వివరణ.. నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా.. తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చాను.. బీఆర్ఎస్లో చేరిక ముందే జాగృతిని స్థాపించా.. తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చా – కవిత 8 ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.. పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు.. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు.. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు.. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది.. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష – కవిత కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది.. ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదు.. కేసీఆర్‌కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా.. నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు.. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు…
*డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు గిరిప్రదక్షణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్* • ఏపీ డిప్యూటీ సీఎం చొరవతో ముందుకు వచ్చిన కీలక అభివృద్ధి ప్రాజెక్టు • గిరిప్రదక్షిణ రహదారిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ • గిరిప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు – 6 కిలోమీటర్లు • ఇందులో 3 కిలోమీటర్లు ఘాట్ రోడ్, మిగతా మార్గం మట్టి రోడ్డు • 50 ఫీట్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి ప్రణాళిక • 30 ఫీట్ల రోడ్డు, 20 ఫీట్ల ఫుట్‌పాత్ నిర్మాణంపై అధ్యయనం • భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ సదుపాయాల కల్పన • 1150 మీటర్ల రహదారి ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని గుర్తింపు • గిరిప్రదక్షణకు ఫారెస్ట్ శాఖ పూర్తి సహకారం ఇస్తుందని డీఎఫ్ఓ స్పష్టం • ఫారెస్ట్ భూమికి బదులుగా ఎండోమెంట్ భూమి ఇచ్చే ప్రతిపాదన • మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో సమస్య…
సమష్టిగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేద్దాము * గిరి ప్రదక్షిణ మార్గం సాకారం కావాలి * మీరు పనులు మొదలుపెడితే స్వయంగా వచ్చి కరసేవ చేస్తా * ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన టీటీడీకి ధన్యవాదాలు * కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు “ఆంజనేయస్వామి అందరి దేవుడు, విశ్వాంతర్యామి. ఆయన ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి వారికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సాకారం చేద్దాం. అందరూ పూనుకొని స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏదీ…
కొండగట్టు ప్రశ్నిస్తోంది… పాలకుల మౌనం ఎందుకని? తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు మరోసారి రాష్ట్ర పాలనను ప్రశ్నించే వేదికగా మారింది. ఈరోజు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నారు. ఆయన తన చొరవతో, తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) నుంచి మంజూరైన నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇది ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై గట్టి విమర్శ. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఆలయానికి ఇప్పటికీ సరైన వసతి సౌకర్యాలు లేవు. తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి మందిరాలు, భక్తుల రక్షణకు అవసరమైన మౌలిక వసతులు.. ఇవన్నీ మాటల్లోనే మిగిలిపోయాయి. ప్రభుత్వాలు మారాయి, మంత్రులు మారారు, హామీలు మారాయి. కానీ కొండగట్టు పరిస్థితి మాత్రం మారలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి భారీగా…
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి…
🌍జగిత్యాల జిల్లాలో చైనా_మంజా పూర్తిగా నిషేధించబడింది 🌍 ప్రజల,పక్షుల భద్రత & పర్యావరణ సంరక్షణ కోసం ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. 🌍 చైనా మంజాను అమ్మినా, కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ #శ్రీ_అశోక్_కుమార్_ఐపీఎస్ గారు అన్నారు 🌍 ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా నిల్వ ఉన్నట్లు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా 8712672000 నంబర్‌కు కానీ Dial_100 కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. 🌍 మీ సమాచారం ఒక జీవితాన్ని కాపాడవచ్చు. Telangana State Police #jagtial #jagtialpolice
జగిత్యాల పట్టణంలోని 9వ వార్డు లో కోతుల ను నియంత్రించాలని ప్రజావాణిలో కలెక్టర్ సత్య ప్రసాద్ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి పట్టణ కార్యదర్శి, 9వ వార్డు నాయకురాలు. గడ్డల లక్ష్మిహరి కృష్ణ
సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజుపాయి. బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు జగిత్యాల: భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం అటల్ బిహారీ వాజుపాయి అని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమంలో వాజుపాయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 1924 డిసెంబర్ 25 రోజున గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ఆర్ఎస్ఎస్ లో చేరి పూర్తిస్థాయి సేవకుడిగా ప్రచారక్ గా దేశ సేవకు వారి జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది అని కొనియాడారు. వాజుపాయ్ గారు కవిగా జాతీయవాదాన్ని బలపరిచే పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. 1957లో మొదటిసారిగా పార్లమెంటుకు…
