HEALTH

రక్త దాన శిభిరము చొప్పదండిలో

By HANMANDLA RAJI REDDY • 2026-10-21 05:12 • 3 views   Share WhatsApp Share Facebook Share X
రక్త దాన శిభిరము చొప్పదండిలో

చొప్పదండిలో ఘనంగా రక్తదాన శిబిరం

యువజన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 28 యూనిట్ల రక్తదానం

చొప్పదండి: చొప్పదండి యువజన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కరీంనగర్ బ్లడ్ సెంటర్ సహకారంతో చొప్పదండిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 28 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి 28 యూనిట్ల రక్తాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కరీంనగర్ వైస్ చైర్మన్ Vootkuri Radhakrishna Reddy మాట్లాడుతూ, 28 మంది యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతోమంది రోగులకు ఉపయోగపడుతుందని, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. అలాగే రక్త దానం చేయడం వలన మనకు ఒక రోజులో కొత్త రక్తం వస్తుందని దానితో మన ఆరోగ్యం మెరుగు పడుతుందని అలాగేఆరోగ్యంగా ఉన్న యువకులు 3 నెలలకు ఒక సారి రక్త దానం చేయవచ్చని తెలిపారు.

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.ఎల్.ఎన్. రెడ్డి రక్తదానం చేసిన యువకులను అభినందించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.

యువజన రెడ్డి సంఘం అధ్యక్షుడు చొప్పదండి గంగారెడ్డి మాట్లాడుతూ, తమ సంఘం యువకులు రక్తదానం చేయడం గర్వకారణమని అన్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో Redcross Life Member Vootkuri Venkat Reddy, Reddy JAC member Hanmantha reddy, Indrasenareddy, Gannu Maheshwar Reddy, Srinivas Reddy యువజన రెడ్డి సంఘం ప్రెసిడెంట్ కొత్త గంగారెడ్డి, జనరల్ సెక్రటరీ గుర్రం చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ గుర్రం యశ్వంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గుర్రం రామకృష్ణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సోమ శ్యామ్ సుందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గుర్రం సమరసింహారెడ్డి, నోముల కౌశిక్ రెడ్డి, లోక వంశీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కట్కం మురళీకృష్ణ రెడ్డి, కట్కం శ్రీనివాస్ రెడ్డి, సురకొంటి శేఖర్ రెడ్డి, గుర్రం రవితేజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేసిన 28 మంది యువకులను నిర్వాహకులు అభినందించారు.

రక్తదానం చేయండి – ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలవండి!

#Indian Redcross Society Karimnagar
HANMANDLA RAJI REDDY 0 followers