LATEST NEWS

ఐఐఏ తెలంగాణ చాప్టర్ వైస్ చైర్‌పర్సన్‌గా ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు ఘన విజయం** వాస్తుశిల్పుల ఐక్యత, వృత్తి అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి......

By NANDURI VENKATESWARLU • 2026-09-05 06:53 • 4 views   Share WhatsApp Share Facebook Share X
ఐఐఏ తెలంగాణ చాప్టర్ వైస్ చైర్‌పర్సన్‌గా  ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు ఘన విజయం**  వాస్తుశిల్పుల ఐక్యత, వృత్తి అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి......

హైదరాబాద్, సెప్టెంబర్ 4: భారతీయ వాస్తుశిల్పుల సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ (IIA) తెలంగాణ చాప్టర్ ఎన్నికల్లో ప్రముఖ ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు వైస్ చైర్‌పర్సన్‌గా ఘన విజయం సాధించారు.

ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు మాట్లాడుతూ, తన విజయానికి సహకరించిన తెలంగాణ రాష్ట్రంలోని ఆర్కిటెక్ట్ సభ్యులు, సీనియర్ ఆర్కిటెక్ట్‌లు, సహచరులు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి అందించిన ఈ విజయాన్ని వ్యక్తిగత విజయంగా కాకుండా, మొత్తం వాస్తుశిల్పుల సమాజం సాధించిన విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కొత్తగా ఎన్నికైన కార్యవర్గంతో కలిసి IIA తెలంగాణ చాప్టర్‌ను మరింత బలోపేతం చేసి, ఐక్యంగా, ప్రగతిశీలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వాస్తుశిల్ప వృత్తి అభివృద్ధి, యువ ఆర్కిటెక్ట్‌లకు ప్రోత్సాహం, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు, సీనియర్ మరియు యువ ఆర్కిటెక్ట్‌ల మధ్య సమన్వయం వంటి అంశాలకు తన పదవీకాలంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.

భారతీయ సంస్కృతిలో వాస్తు విధానం ఒకటని, వాస్తు విధానాన్ని పాటించి వారి వారి జీవన విధానాలను మార్చుకోవడం చాలా అవసరమని ఈ సందర్భంగా వాస్తు తత్వం, వాస్తు అలవాట్లు, వాస్తు ప్రాముఖ్యతను తనదైన శైలిలో యెండూరి సురేష్ బాబు వివరించారు. వాస్తు రంగంలో ప్రజలు ముందడుగు వేయడానికి అవసరమైన వివిధ అంశాలను సమగ్రంగా వివరించడం గొప్ప విషయంగా భావించవచ్చని పేర్కొన్నారు.

“మనందరం కలిసి పనిచేస్తేనే IIA తెలంగాణను మరింత బలమైన, ఐక్యమైన మరియు గొప్ప సంస్థగా తీర్చిదిద్దగలం. ఈ విజయం మీ అందరిదీ. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను” అని ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు పేర్కొన్నారు.

##latestnews
NANDURI VENKATESWARLU 0 followers