ఎమ్మెల్సీ కవిత రూట్ మార్చారా..! ఇకమీదట ఆమె ఎర్రజెండా ఉద్యమానికి ఊపిరిపోయబోతున్నారా..! ఇన్నాళ్లు విమర్శలు- ప్రతి విమర్శలతోనే సరిపెట్టిన కవిత.. ఈ డోస్ సరిపోదని భావిస్తున్నారా..! అందుకే ఆమె కమ్యూనిస్టులా మాదిరిగా పోరాటానికి దిగుతున్నారా..! అసలు కవిత కమ్యూనిస్టులను ఎందుకు ఫాలో అవుతున్నారు.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!
Kavitha Strategy: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత ఓ సంచలనం.. గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యక కవిత తన సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. త్వరలోనే పార్టీ కూడా పెడతానంటూ కవిత ప్రకటించారు. అయితే జిల్లాల పర్యటనలో కవిత దూకుడు గులాబీ లీడర్లను సైతం షేక్ చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ ఉన్న లీడర్లే టార్గెట్ గా కవిత విమర్శలు ఉంటున్నాయి.. ఇక ఇన్నాళ్లు రాజకీయ విమర్శలతోనే సరిపెట్టిన కవిత.. ఇప్పుడు రూట్ మార్చారు. ఇకమీదట తెలంగాణ జాగృతి కార్యక్రమాలన్నీ కమ్యూనిస్టు ఉద్యమాల తరహాలో ఉంటాయని ప్రకటించారు. ఇప్పుడు కవిత చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ హాపిక్ గా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాలు కనిపించకుండా పోయాయి.. ఈ నేపథ్యంలో కవిత ఎర్రజెండాను గుర్తు చేయడం మాత్రం కమ్యూనిస్టులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుందని టాక్ వినిపిస్తోంది.
