వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం, పీసీసీ చీఫ్.
ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలని దిశానిర్దేశం.. పెండింగ్ పనులను పరిష్కరించాలని సూచన. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని ఆదేశం.
మరో వారం, పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అలర్ట్ చేశారు. ఈ లోపే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా తమను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్ పలు సూచనలు చేస్తూ.. వారిని అప్రమత్తం చేస్తున్నారు
సిటీలో, పట్టణాల్లో గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రులు కూడా దీనిపై దృష్టిపెట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి వస్తున్న ఇలాంటి సమస్యలపై వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
#TelanganaPolitics
Political Laboratory

