National

*ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ - జాతీయ విద్యార్థి దినోత్సవము...............

By NANDURI VENKATESWARLU • 2026-10-15 11:30 • 10 views   Share WhatsApp Share Facebook Share X
*ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ - జాతీయ విద్యార్థి దినోత్సవము...............

తేది:15-10-2026:ఈరోజు ఉదయము గచ్చిబౌలి డివిజన్ పరిధిలోగల గోపన్పల్లిలో ఉన్న శిశుమంగల్ అనాధ ఆశ్రమం నందు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ A. P. J. అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు, పంచిపెట్టారు ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ " *భారతరత్న అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందుకు కారణం విద్య పట్ల ఆయనకు ఉన్న లోతైన నిబద్దత మరియు విద్యార్థులతో ఆయనకు ఉన్న అనుబంధం. సమాజంలో విద్యార్థుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నము"* అని అన్నారు. " *భారతదేశ 11వ రాష్ట్రపతిగా, భారత అంతరిక్ష మరియు సైనిక పరిశోధనల పురోగతికి గణనీయమైన కృషి చేసిన అత్యుత్తమ విద్యా వేత్తలలో కలాంగారు ఒకరు. భారతదేశ అణు సామర్థ్యాలకు ఆయన విశేషమైన కృషి చేశారు* " అని అన్నారు. " *ఆయన DRDO అధిపతిగా, అలాగే ISRO లో కూడా పనిచేశారు. ఫోక్రన్ అణు పరీక్షలలో కీలకపాత్ర పోషించారు. ఆయన శాస్త్రీయ విజయాలకు మించి విద్య అవిష్కరణ మరియు జాతీయ అభివృద్ధి కోసం కృషి చేసి యువతకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు. ఆయన సరళత, దార్శనికత మరియు ప్రజల సంక్షేమం పట్ల నిబద్దతలే ఆయనను దేశ చరిత్రలో ప్రియమైన అధ్యక్షునిగా చేశాయి. ఆయన నడవడిక మన అందరికి ఆచరణీయం. ఆయన బాలిస్టిక్ క్షిపణులను మరియు లాంఛ్ వెహికల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో విశేషమైన కృషి సల్పారు. అందుకనే ఆయనకు మిసైల్ మాన్ (క్షిపణి కర్త) అనే పేరు వచ్చింది. ప్రపంచ గగన వీధులలో భారత కీర్తి పతాకాన్ని యినుమడింపజేసిన గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్త* " అని కొనియాడారు. " *ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడానికి విజన్ 2020ని రూపొందించిన గొప్ప దార్శనికుడు. లక్ష్య సాధనలో సాంకేతికత, విద్యా మరియు స్థిరమైన అభివృద్ధి మొదలైన వాటి విలువను నొక్కి చెప్పారు. ఆయన గొప్ప మానవతావాది. వికలాంగులకు కృత్రిమ అవయవాల రూపకల్పన, అలాగే గుండె జబ్బుల వారికి అవసరమైన స్టంట్లు సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా స్టంట్ల తయారీలో కీలకపాత్ర పోషించారు. ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లు మరియు బిరుదులతో సత్కరించడం జరిగింది* " అని తెలిపారు. " *ఆయన జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ"* అని కొనియాడారు. " *ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో విలువలతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించడం ద్వారా అది దేశ భవిష్యత్తును మార్చగలదు. విద్య తోటే సంస్కారం అలవడుతుంది. అందుకు ఏకాగ్రత, పట్టుదల, కృషి మొదలైన వాటితో పాటు విద్యా రంగంలో వస్తున్న అనేక మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతికతలో ప్రావీణ్యతలను సంపాదించుకోవాలి. అలాగే మద్యపానము, ధూమపానము, మాదకద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరముగా ఉండటం, సమయాన్ని వృధా చేసే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చాలా మంచిది. అంతే కాకుండా నిత్యము వ్యాయామము, మెడిటేషన్, యోగా చేయడం, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రపంచ విద్యార్థులకు ధీటుగా రాణించి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికై కలలు కని వాటి సాకారానికై కృషి చేసి, దేశాభివృద్ధిలో పాలు పంచుకొని మన దేశ కీర్తి ప్రతిష్టలను యినుమడింప చేయాలి. భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. చేతి వ్రాత బాగుండాలి. నిత్యము పుస్తక పఠనము చేయాలి. విద్య తోటే జ్ఞానము, ధైర్యము కలుగుతాయి. అప్పుడే మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి విజయం సాధించగలుగుతాము. అదే మనము కలాం గారికి అర్పించే నిజమైన నివాళి"* అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశు మంగళ్ అనాధాశ్రమం నిర్వాహకులు శ్రీనివాస్ గారు, అధ్యాపకుల విద్యార్థిని, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి జీవి రావు శివరామకృష్ణ, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

NANDURI VENKATESWARLU 0 followers