CULTURAL NEWS

ఆదర్శనగర్ గణపతి ఉత్సవాల మహోత్సవం అలరించిన సంగీత విభావరి*......

By NANDURI VENKATESWARLU • 2026-09-24 05:51 • 4 views   Share WhatsApp Share Facebook Share X
ఆదర్శనగర్ గణపతి ఉత్సవాల మహోత్సవం అలరించిన సంగీత విభావరి*......

ది 22-09-2026:శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల ఆదర్శనగర్ కాలనీ నందు ఏర్పాటుచేసిన పార్వతీపుత్రుడు మహాగుణాధిపతి నవరాత్రి ఆరాధన, గడిచిన ఆరేడు రోజుల నుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.గణేష్ ఉత్సవ కమిటీ వారు ఈరోజు సాయంత్రం ఆదర్శ్ నగర్ లో ఏర్పాటు చేయబడినటువంటి గణపతి ఆరాధన మండపం నందు సంగీత విభావరిని ఏర్పాటు చేయడం జరిగింది . అందులో భాగంగా మహోన్నత సంగీత కారులు మంచి మంచి భక్తి గీతాలు. అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు,వంటి వాగ్గేయకారుల గీతాలను, కాలనీ వాసులే కాకుండా, ఇతర భక్తులను అలరించారనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్నమయ్య గీతాలు, ఆలపిస్తున్నంత సేపు భక్తులు తన్మయములో ఓలలాడిపోయారు. వారు ఆలపించిన గీతాలకు భక్తులు మంత్రముగ్ధులయ్యారు. సంగీత విభావరి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఏఐ మీడియా ఉత్సవ కమిటీ పెద్దలని కలిసి, కొద్దిసేపు ముచ్చటించింది.గణేష్ నవరాత్రి ఉత్సవాల విశేషాంశాలను తెలుసుకోవడం జరిగింది.ఈ వినాయక ఉత్సవ కమిటీ పెద్దలతో పాటుగా ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్న పుర ప్రముఖులు,మాట్లాడుతూ, ఉత్సవ కమిటీ వారు ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రుల తో పాటు సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉపన్యాసాలు నిర్వహించి, భక్తులను హర్షింప చేయటం ఆ నవాయితీగా వస్తున్నదని, అందులో భాగంగా ఈరోజు ఈ సంగీత విభావరిని ఏర్పాటు చేయడం జరిగిందని, చాలా చక్కని భక్తి గీతాలను ఆలపించి, వినాయకుడి భక్తులను ఆనంద డోలికల్లో ఉర్రూతలూగించారని వారు తెలియజేశారు.

NANDURI VENKATESWARLU 0 followers