హైదరాబాద్, జూన్ 20: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మల్కాజిగిరి కోర్టు భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసింది. నెల రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్ లభించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఓ మైనర్ బాలికకు సంబంధించిన ఫిర్యాదు ఆధారంగా గత మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు మే 16న భగీరథ్‌ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు.
దర్యాప్తులో మరిన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పోలీసులు కస్టడీ కోరగా, మల్కాజిగిరి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.
ఇదే సమయంలో భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన మల్కాజిగిరి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.