* "ప్రతిమాసం వాణి దరహాసం" ప్రముఖ సాహితీవేత్త ఉపన్యాసకర్త మంత్రి రాజు శివరామయ్యగారి ప్రసంగం.......**
తేదీ13-08-2026: రాక్షసులు నాస్తికులు అయినప్పటికిని, ఏదో విధంగా భగవంతుని దర్శనం పొందాలని తపన కలిగి ఉండడం విశేషం. అని ప్రముఖ ఆంధ్ర సంస్కృత ఉపన్యాసకులు మంత్రి రాజు శివరామయ్య గారు పేర్కొన్నారు. పొన్నూరు బ్రాహ్మణ బజారు లో ఉన్న శంకర మఠము నందు" ప్రతి మాసంవాణి దరహాసం" అనే సాంస్కృతిక సంస్థ ద్వారా విధ్వాంసులు, పండితులు, అవధానులు, వ్యాస ప్రసంగాలు, పురాణ పఠనాలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల తొమ్మిదవ తారీఖున ప్రముఖ ఆంధ్ర సంస్కృతో ధ్యాపక, ఉపన్యాసకులు, మంత్రి రాజు శివరామయ్య గారి చేత "ప్రహ్లాదోపాఖ్యానం" అనే ఘట్టాన్ని చెప్పించారు. ఈ ఘట్టములోని నరసింహస్వామి ఉద్భవము కన్నులకు కట్టినట్లుగా శ్రీ శివరామయ్య గారు వివరించారు. హిరణ్యకశికుని గొంతెమ్మ కోరికలు అంతమొందించుట కొరకు ప్రహ్లాదుని భక్తితత్వం నేటి భక్తవరులకు అందించిన మహాకవి బమ్మెర పోతన గారి రచనా చమత్కృతి, తన వచనా చమస్కృతితో శివరామయ్య గారు దాదాపుగా గంట 20 నిమిషాలు శ్రోతలను ఉర్రూతలూగించారనడంలో ఎటువంటి సందేహం లేదు. పొన్నూరు తనకు అక్షరాభ్యాసాన్నిచ్చిన పట్టణమని ఈ పట్టణానికి తనకు ఎంతో అనుబంధం ఉందని ఈ పట్టణంలో వేంచేసియున్న సాక్షి శ్రీ భావనారాయణ స్వామి తనకు పాండిత్యం అందించారని తను భవనాను స్వామి సంస్కృతి కళాశాలలో విద్యార్థిగా నేను అభ్యసించినటువంటి ఆ సాక్షి భావనారాయణుడు అందించినటువంటి నాలుగు మాటలు మీ ముందు ఉంచడానికి సాహసించానని శ్రోతలతో తన అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి మాసం వాణి దరహాసం సంస్థ నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో శ్రోతలు పాల్గొన్నారు.