జ్యోతిబా ఫూలే అంబేద్కర్ జై యుగం కప్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన బీసీ జేఏసీ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి ఉష
జ్యోతిబా ఫూలే అంబేద్కర్ జై యుగం కప్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన
బీసీ జేఏసీ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి ఉష
గత పది రోజుల నుండి పెద్దపెల్లి నియోజకవర్గం లోని అన్ని మండలాలలో జ్యోతిబా ఫూలే అంబేద్కర్ జై యుగం క్రికెట్ టోర్నమెంట్ దాసరి ఉష గారు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసినదే ఈ సందర్భంగా మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొన్న ఈరోజు ఎలిగేడు మండలం టోర్నమెంట్ ఆర్గనైజర్లు బి ,వినోద్, ఏ, రమేష్, జి ,అక్షయ్, గార్ల ఆధ్వర్యం లో ఎలిగేడు గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది ఈ సందర్భంగా ఉష గారు ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు
ఈరోజు ఫైనల్ మ్యాచ్లో ఎలిగేడు విషెస్ శివ పల్లి ఆడారు , ఈ క్రికెట్ టోర్నమెంటులో ఎలిగేడు శ్రీకాంత్ టీం విన్నర్స్ గా నిలిచి షీల్డ్, మరియు 10000 నగదు బహుమానం గెలుచుకున్నారు, అలాగే రన్నర్గా శివ పల్లి అనిల్ టీం షీల్డ్ మరియు 5000 నగదు బహుమానం గెలుపొందారు
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి రామ్ రెడ్డి , ఎలిగేడు సర్పంచ్ కప్పల ప్రవీణ్ , నర్సాపూర్ సర్పంచ్ పల్లేర్ల వెంకటేష్ గౌడ్ , ఉప సర్పంచ్ వెంకటేశ్వర్రావు , వార్డు సభ్యులు నాదరి పోచాలు , పల్లె కార్తీక్ , బండ రమేష్ , కొంపెల్లి సాయి , బోయిని సత్యం , మరియు అసెంబ్లీ ఆర్గనైజర్స్ , అబ్దుల్ మాలిక్ , బొల్లం భూమేష్ , పెద్దపల్లి మండల ఆర్గనైజర్ కన్నం శ్రావణ్ , గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు యువకులు పాల్గొన్నారు