సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజుపాయి.
బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు
జగిత్యాల: భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం అటల్ బిహారీ వాజుపాయి అని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమంలో వాజుపాయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 1924 డిసెంబర్ 25 రోజున గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆర్ఎస్ఎస్ లో చేరి పూర్తిస్థాయి సేవకుడిగా ప్రచారక్ గా దేశ సేవకు వారి జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది అని కొనియాడారు. వాజుపాయ్ గారు కవిగా జాతీయవాదాన్ని బలపరిచే పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. 1957లో మొదటిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత పార్లమెంటులో ప్రజా సమస్యలపై అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారని వారి వాగ్దాటికి జవహర్లాల్ నెహ్రూ సైతం మంత్రముగ్ధుడై ఏదో ఒక రోజు ప్రధాని కాగల సామర్థ్యం వాజుపాయ్ గారికి ఉందని కొనియాడారని గుర్తు చేశారు. 1996లో 13 రోజులపాటు ప్రధానిగా తర్వాత 13 నెలలుగా ప్రధానమంత్రిగా పనిచేసి అప్పుడు ఉన్న రాజకీయ అస్థిరత వల్ల జరిగిన బల నిరూపణలో ఒక్కో ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవిని త్యజించారని తిరిగి 1999లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రధానమంత్రిగా పనిచేసిన పనిచేసిన కాలం ఒక స్వర్ణ ఇవ్వమని అన్నారు. పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో చివరి చొరబాటుదారుని వరకు తరిమికొట్టి భారతదేశం ఎవరి ముందు తలవంచదని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి భూగర్భంలో అని పరీక్షలు జరిపి భారత దేశం సత్తా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నాయకుడని కావేరి జల వివాదాన్ని చిటికలో పరిష్కరించి బిజెపి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఘనత వాజుపేయి గారిదని అన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు పునాది వేస్తే నేడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు అవినీతి రాజకీయాలకు బార్లు తెలిసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారుఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాలతిరుపతి, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా కార్యదర్శి సాంబారి కళావతి, జిల్లా కోశాధికారి దశరథ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సుంచు సురేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికల నవీన్, సీనియర్ నాయకులు రాగిళ్ల సత్యనారాయణ, మరి పెళ్లి సత్యం, ఓరుగంటి చందు, పట్టణ ప్రధాన కార్యదర్శులు సిరికొండ రాజన్న, ఆముదరాజు, పట్టణ ఉపాధ్యక్షులు ఇట్యాల రాము, గాజుల రాజేందర్, మహిళా నాయకులు దురిశెట్టి మమతా, పుష్ప రెడ్డి, గడ్డల లక్ష్మి, మామిడాల కవిత, కడర్ల లావణ్య,భానుప్రియ, కార్యకర్తలు పాల్గొన్నారు.
