April 17, 2026

CPR Awareness Drive Held in Nizamabad Police Commissionerate to Save Lives During Emergencies

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సిపిఆర్‌పై నిజామాబాద్ పోలీసుల అవగాహన కార్యక్రమం

‘Arrive Alive’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లో సిపిఆర్ శిక్షణ – ప్రజlu నేర్చుకోవాలని పిలుపు

అత్యవసర పరిస్థితుల్లో సమయానికి సరైన వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంటూ Telangana State Police ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సిపిఆర్ (CPR) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ #PrajaPalana, #PragathiPranalika 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ P. Sai Chaitanya ఐపీఎస్ నాయకత్వం వహించారు. ‘#ArriveAlive’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిక్షణలో అత్యవసర సమయంలో సిపిఆర్ విధానం ఎంత కీలకమో నిపుణులు వివరించారు.

హఠాత్తుగా గుండె ఆగిపోవడం లేదా శ్వాస ఆడకపోవడం వంటి పరిస్థితుల్లో సిపిఆర్ అందిస్తే బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ప్రాణ రక్షణ నైపుణ్యాన్ని నేర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పాల్గొని అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే సామర్థ్యం సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉండాలని వారు తెలిపారు.

ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించి ప్రాణాలను కాపాడే దిశగా చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

SUNCHU SURESH

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION