Special surveillance on road accident black spots in Jagtial district to prevent road accidents: jagtial SP Ashok Kumar, IPS
రోడ్డు ప్రమాద ప్రాంతాలపై (బ్లాక్ స్పాట్ల) ప్రత్యేక నిఘా… రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్…
అంబేద్కర్ జయంతి వేడుకలతో పాటు “Arrive Alive” రోడ్డు భద్రత ప్రతిజ్ఞలు జిల్లా వ్యాప్తంగా నిర్వహణ.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “Arrive Alive” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం (ఏప్రిల్ 14) జిల్లావ్యాప్తంగా రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అంబేద్కర్ విగ్రహాల సమీపంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే అవకాశమున్న బ్లాక్ స్పాట్లు, అక్సిడెంట్ ప్రోన్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు, డీఎస్పీలు, సంబంధిత సీఐలు, ఎస్ఐలు ప్రత్యక్షంగా పరిశీలించి ఆయా ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పరిపాలన, R&B, NHAI, ట్రాన్స్‌పోర్ట్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది.అదేవిధంగా జీబ్రా క్రాసింగ్స్ మరమ్మత్తు, రోడ్డు లైన్ మార్కింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, రోడ్డు ఇరువైపులా ఉన్న మొక్కల తొలగింపు వంటి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం భావనతో పనిచేస్తూ, ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ తక్షణ నివారణ చర్యలు చేపడుతున్నాం అన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని ట్రాఫిక్ నియమాలను పాటించడం హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ,అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం చేయకూడదని అన్నరు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రత పట్ల తమ బాధ్యతను ప్రతిజ్ఞ ద్వారా వ్యక్తపరిచారని అన్నారు.
Telangana State Police
#RoadSafety #ArriveAlive #AmbedkarJayanti