Gadwal మండలం, మే 6: గద్వాల మండలం కొత్తపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని D.K. Snigdha Reddy సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు ఆలస్యం లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించుకునేలా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని, కేంద్రాల్లో తగిన గన్నీ బ్యాగులు సమృద్ధిగా ఉండేలా చూడాలని కోరారు.
వరి ధాన్యం తడిసిపోతే నష్టం కలగొచ్చని పేర్కొంటూ, సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా గన్నీ బ్యాగులు అందుబాటులో లేవని తమ సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన స్నిగ్ద రెడ్డి, కొనుగోలు కేంద్రాల్లో తగిన సంఖ్యలో గన్నీ బ్యాగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అలాగే, రైతులు ఎండలో ఎక్కువసేపు నిలబడకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.