April 16, 2026

ట్రాఫిక్ నియమాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం… “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన…

ట్రాఫిక్ నియమాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం…

“Arrive Alive” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విస్తృత రోడ్డు భద్రత అవగాహన….

చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అలవరచుకోవడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదగవచ్చనే లక్ష్యంతో “Arrive Alive” కార్యక్రమం కింద జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మూడవ రోజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ద్వారా తల్లిదండ్రుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు “డియర్ పేరెంట్స్, ప్లీజ్ బై ఏ హెల్మెట్ ఫర్ మీ అండ్ మామ్” అనే సందేశంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్ కొనివ్వమని లేఖలు రాయడం ద్వారా కుటుంబ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించవచ్చని సూచించారు.

అలాగే విద్యార్థులకు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, స్కూల్‌కు వెళ్లే సమయంలో ఇరుపక్కల చూసుకుని జాగ్రత్తగా దాటడం, స్కూల్ బస్సులో ఎక్కడం, దిగడం సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం వంటి అలవాట్లు నిత్యజీవితంలో పాటించాలని సూచించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Telangana State Police

SUNCHU SURESH

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION