మహబూబ్నగర్ పట్టణంలోని ఆర్టీసీ నూతన బస్టాండ్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో పట్టణంలోని పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ, ప్రజా రవాణా సేవలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమ్మె పరిస్థితుల్లో ప్రైవేట్ డ్రైవర్లు మరియు సిబ్బంది భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని, వారికి అవసరమైన రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం కలిగించడం లేదా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ సందర్శనలో అదనపు ఎస్పీ ఎన్‌బి రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మొతిరాం, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు శాఖ ప్రజలను శాంతి భద్రతలు కాపాడడంలో సహకరించాలని కోరింది.