May 18, 2026

కరీంనగర్‌లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టుల పరిశీలనకు కేంద్ర బృందం పర్యట

కరీంనగర్, మే 16: కరీంనగర్ నగర అభివృద్ధికి సంబంధించి Urban Challenge Fund (UCF) కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర బృందం నగరంలోని పలు అభివృద్ధి ప్రాంతాలను సందర్శించింది.

కేంద్ర బృందానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మరియు ఇంజినీరింగ్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నగరంలో ప్రతిపాదించిన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, అర్బన్ మొబిలిటీ, పర్యావరణ హిత మౌలిక వసతులు మరియు ఇతర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులు వివరాలు అందించారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, కరీంనగర్ నగర అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రస్థాయిలో పరిశీలనకు రావడం సంతోషకరమని తెలిపారు. Urban Challenge Fund ద్వారా నగర మౌలిక వసతులను మెరుగుపరిచే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ, గ్రీన్ స్పేస్‌లు మరియు ఆధునిక సౌకర్యాలు అందించడమే లక్ష్యమని ఆయన చెప్పారు.

క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కేంద్ర బృందం పలు ప్రతిపాదిత అభివృద్ధి ప్రాంతాలను సందర్శించి అధికారులతో చర్చలు జరిపింది.

SUNCHU SURESH

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION